Prashant Kishor: ఓ ఎన్నికల వ్యూహకర్త కథ కంచికి పోతుంది: ప్రశాంత్ కిశోర్ పై బీజేపీ సెటైర్

  • బెంగాల్ లో బీజేపీకి వచ్చే సీట్లు డబుల్ డిజిట్ దాటవన్న ప్రశాంత్ కిశోర్
  • అధికారాన్ని చేపట్టడం ఖాయమన్న విజయవర్గీయ
  • రాష్ట్రంలో బీజేపీ సునామీ కొనసాగుతోందని వ్యాఖ్య
BJP take a dig at Prashat Kishor

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి వచ్చే సీట్ల సంఖ్య డబుల్ డిజిట్ దాటదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. డబుల్ డిజిట్ దాటితే ట్విట్టర్ ను తాను వదిలేస్తానంటూ ఆయన చేసిన ట్వీట్ బాగా వైరల్ అయింది. ఈ వ్యాఖ్యలపై బీజేపీ అదే స్థాయిలో స్పందించింది. బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ ఘన విజయం సాధించి అధికార పీఠంపై కూర్చోవడం ఖాయమని రాష్ట్ర పార్టీ వ్యవహరాల ఇన్ఛార్జి కైలాస్ వియవర్గీయ అన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ సునామీ కొనసాగుతోందని... 200కు పైగా సీట్లను బీజేపీ గెల్చుకుంటుందని చెప్పారు. బీజేపీ అధికారాన్ని చేపట్టిన తర్వాత ఓ ఎన్నికల వ్యూహకర్త కథ కంచికి పోతుందని అన్నారు. బెంగాల్ ప్రజలు బీజేపీ వెంటే ఉన్నారనే విషయం అమిత్ షా పర్యటనతో స్పష్టమైందని చెప్పారు.

More Telugu News