YSRCP: రక్తదానంలో వరల్డ్ రికార్డు సాధించిన వైసీపీ కార్యకర్తలు

 YSRCP workers set world record in blood donation on CM Jagan birthday
  • ఇవాళ సీఎం జగన్ జన్మదినం
  • రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించిన వైసీపీ
  • 8 గంటల్లో 34,723 మంది రక్తదానం
  • వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
  • సజ్జలకు మెడల్ ప్రదానం చేసిన సంస్థ ప్రతినిధులు
ఇవాళ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు పెద్దఎత్తున రక్తదాన కార్యక్రమాలు చేపట్టాయి. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలు ప్రపంచ రికార్డు నమోదు చేశారు. కేవలం 8 గంటల వ్యవధిలోనే 34,723 మంది రక్తదానం చేశారు. ఈ మేరకు వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో వైసీపీ కార్యకర్తల రక్తదాన యజ్ఞం స్థానం దక్కించుకుంది. దీనికి సంబంధించిన మెడల్, సర్టిఫికెట్ ను వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రదానం చేశారు.

సీఎం జగన్ 48వ పుట్టినరోజు సందర్భంగా దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ రక్తదాన కార్యక్రమాలు నిర్వహించారు. గత కొన్నిరోజుల ముందు నుంచే రక్తదాన శిబిరాల గురించి ప్రచారం చేయడంతో మంచి స్పందన వచ్చినట్టు తెలుస్తోంది.
YSRCP
Workers
World Record
Blood Donation
Jagan
Birthday

More Telugu News