Jupiter: కాసేపట్లో ఖగోళ అద్భుతం... ఆకాశంలో ఒకటిగా కనిపించనున్న రెండు అతిపెద్ద గ్రహాలు

  • పునరావృతం కానున్న ఖగోళ అద్భుతం
  • అత్యంత సమీపానికి రానున్న గురు, శని గ్రహాలు
  • భారత్ లో సాయంత్రం 5.21 నిమిషాల నుంచి 7.12 నిమిషాల వరకు కనిపిస్తుంది  
  • గతంలో 1623లో కనిపించిన అద్భుతం
Jupiter and Mars comes extremely close to each other

అత్యంత అరుదుగా చోటుచేసుకునే ఖగోళ అద్భుతం ఇవాళ పునరావృతం అవుతోంది. ఎప్పుడో 1623లో ఒకదానికొకటి అత్యంత సమీపానికి వచ్చిన గురు, శని గ్రహాలు మళ్లీ ఇన్నాళ్లకు వినువీధిలో అరుదైన రీతిలో కనువిందు చేయనున్నాయి. ఈ అపురూమైన దృశ్యం ఈ సాయంత్రం 5.21 నిమిషాల నుంచి 7.12 నిమిషాల వరకు ఆవిష్కృతం కానుంది. అత్యంత సమీపానికి రానున్న ఈ రెండు అతిపెద్ద గ్రహాలు ఆకాశంలో ఒకటిగా కనిపించనున్నాయి. దీనినే శాస్త్రవేత్తలు 'మహా సంయోగం'గా అభివర్ణిస్తారు. 

మన దేశంలో ఈ కమనీయ దృశ్యం దాదాపు 2 గంటల పాటు వీక్షించే అవకాశం ఉందని ఖగోళ పరిశోధకులు చెబుతున్నారు. భూమి నుంచి చూస్తే గురు, శని గ్రహాలు 0.1 డిగ్రీల ఎడంగా దర్శనమిస్తాయి. కాగా, ఈ రెండు గ్రహాలు మళ్లీ 2080 మార్చి 15న అత్యంత చేరువకు వస్తాయి.

More Telugu News