Sonu Sood: నాకెందుకండీ గుడి... నేను అందుకు అర్హుడ్ని కాదు: సోనూ సూద్

 Sonu Sood responds over temple matter
  • కరోనా కష్టకాలంలో వేలమందిని ఆదుకున్న సోనూ సూద్
  • హద్దుల్లేని దాతృత్వంతో ప్రజల హృదయాల్లో నిలిచిన వైనం
  • తెలంగాణలో గుడికట్టిన ప్రజలు
  • సిద్ధిపేట జిల్లా దుబ్బా తండాలో విగ్రహ ప్రతిష్టాపన
  • ప్రజల ప్రేమకు ముగ్ధుడ్నయ్యానన్న సోనూ సూద్
నటుడు సోనూ సూద్ ఇప్పుడు జాతీయ స్థాయిలో రియల్ హీరో. కరోనా వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉన్నవేళ సోనూ సూద్ ఎల్లలు లేని దాతృత్వ సేవలు ఆయన కీర్తిప్రతిష్ఠలను అమాంతం పెంచేశాయి. తాజాగా తెలంగాణలో ఆయనకు గుడి కూడా కట్టారు. సిద్ధిపేట జిల్లా దుబ్బా తండాలో గుడి కట్టి ఆయన విగ్రహం ప్రతిష్టించారు.

ఈ విషయం సోనూ సూద్ దృష్టికి వెళ్లింది. నాకెందుకండీ గుడి... నేను అందుకు అర్హుడ్ని కాదు అంటూ సోనూ సూద్ వినమ్రంగా బదులిచ్చారు. అయితే, తనకు గుడి కట్టిన ప్రజల అభిమానానికి ముగ్ధుడ్ని అయ్యానంటూ ట్విట్టర్ లో వెల్లడించారు.
Sonu Sood
Temple
Tanda
Siddipet District
Telangana

More Telugu News