Shigella Infection: కేరళలో షిగెల్లా ఇన్ఫెక్షన్ కలకలం... ఒకరి మృతి

  • దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి
  • కేరళలో కొత్త రకం ఇన్ఫెక్షన్
  • పేగులను దెబ్బతీసే షిగెల్లా బ్యాక్టీరియా
  • కోజికోడ్ జిల్లాలో 40 కేసులు
  • పరిస్థితి అదుపులోనే ఉందన్న జిల్లా వైద్యాధికారి
 Shigella infection traces in Kerala

యావత్ భారతదేశం కరోనా మహమ్మారితో ముమ్మర పోరాటం చేస్తున్న వేళ కేరళలో కొత్త రకం ఇన్ఫెక్షన్ కలకలం రేపుతోంది. కేరళలోని కోజికోడ్ జిల్లాలో పేగులకు సంబంధించిన షిగెల్లా ఇన్ఫెక్షన్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే 11 ఏళ్ల చిన్నారి షిగెల్లా ఇన్ఫెక్షన్ తో మృతి చెందడంతో కేరళ అధికార వర్గాలు అప్రమత్తమయ్యాయి. కోజికోడ్ జిల్లాలో 40 కేసుల వరకు వెల్లడయ్యాయి. ప్రస్తుతం ఈ ఇన్ఫెక్షన్ అదుపులోనే ఉందని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వి జయశ్రీ వెల్లడించారు.

షిగెల్లా అనే బ్యాక్టీరియా కారణంగా పేగుల్లో ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. దీని ప్రధాన లక్షణాలు డయేరియా, తరచుగా మలంలో రక్తం, బంక కనిపిస్తాయి. కడుపు నొప్పితో పాటు జ్వరం కూడా వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ కు గురైన వ్యక్తిలో వారం రోజుల తర్వాత లక్షణాలు కనిపిస్తాయి. ఐదేళ్ల లోపు పిల్లలతో పాటు, కొన్ని సార్లు పెద్దలకు కూడా ఇది ప్రాణాంతకం అవుతుంది. అమెరికాలోనూ షిగెల్లా కేసులు పెద్ద సంఖ్యలో వస్తుంటాయి. అగ్రరాజ్యంలో ఏటా 5 లక్షల మంది ఈ ప్రమాదకర ఇన్ఫెక్షన్ బారినపడుతుంటారట.

More Telugu News