Roja: అన్నకు నేనిస్తున్న బర్త్ డే గిఫ్ట్ ఇదే: రోజా

Roja Gift for Jagan on Birthday
  • మంచి మనిషి జన్మదినాన మంచి పని చేస్తున్నా
  • ఓ బాలికను దత్తత తీసుకున్నానన్న రోజా
  • బాలిక బాగోగులు తనవేనని వెల్లడి
"మంచి మనిషి జన్మదినాన ఒక మంచి పని..! మన అందరి ప్రియతమ నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ అన్న పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి పనికి శ్రీకారం చుట్టడం జరిగింది. పి.పుష్పకుమారి అనే ఈ చిన్నారి పూర్తి చదువుకు నేను దత్తత తీసుకోవడం జరిగింది" అని నగరి ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత ఆర్కే రోజా తెలియజేశారు. ఈ మేరకు ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ పెట్టారు.

బాల్యంలోనే తల్లిదండ్రులు దూరం కాగా, తిరుపతిలోని గర్ల్స్ హోమ్ లో ఉంటూ మెడిసిన్ చదవాలన్న తన కలను సాకారం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న పుష్పకుమారి అనే బాలికను రోజా దత్తత తీసుకున్నారు. ఆమె చదువుకు అయ్యే ఖర్చుతో పాటు భవిష్యత్తులో అన్ని రకాలుగా సాయం చేస్తానని రోజా అన్నారు. లక్షలాది మంది చిన్నారులకు మేనమామగా ఉంటూ వారి విద్యకు సహకరిస్తున్న జగనన్నకు తానిచ్చే పుట్టిన రోజు బహుమతి ఇదేనని తెలిపారు.
Roja
Jagan
Birthday

More Telugu News