Sabarimala: అయ్యప్ప భక్తులకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు కీలక సూచన

  • దర్శనానికి 48 గంటల ముందు ఆర్టీ-పీసీఆర్ టెస్టు తప్పనిసరి
  • ధ్రువీకరణ పత్రం లేని వారిని అనుమతించబోమన్న బోర్డు
  • 26న మండల పూజ అనంతరం ఆలయం మూత
Lord Ayyappa devotees must have rtpcr test report

అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) కీలక సూచనలు చేసింది. స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు తప్పనిసరి అని పేర్కొంది. ఈ పరీక్షల్లో తమకు కొవిడ్ సోకలేదని నిర్ధారణ అయితేనే దర్శనానికి అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది.

శబరిమల వచ్చే భక్తులు దర్శనానికి 48 గంటల ముందు చేయించుకున్న ఆర్టీ-పీసీఆర్ పరీక్ష ధ్రువీకరణ పత్రాన్ని అధికారులకు చూపించాలని టీడీబీ అధ్యక్షుడు ఎన్ వాసు పేర్కొన్నారు. ధ్రువీకరణ పత్రం లేని వారిని అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ నెల 26 నుంచే ఈ విధానం అమల్లోకి వస్తుందన్నారు. కాగా, 26న మండలపూజ అనంతరం ఆలయాన్ని మూసివేసి 31న మకరవిళక్కు పూజ కోసం తిరిగి తెరవనున్నారు.

More Telugu News