Karnataka: తూటాలతో విమానం ఎక్కుతూ తనిఖీలలో చిక్కిన కర్ణాటక మాజీ ఎమ్మెల్యే

Karnataka ex mla manappa vajjal caught with bullets
  • బెంగళూరు విమానాశ్రయంలో 16 తూటాలతో పట్టుబడిన వజ్జల్
  • పొరపాటున తీసుకొచ్చానంటూ వివరణ
  • హెచ్చరించి వదిలేసిన అధికారులు
బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చిన కర్ణాటక మాజీ ఎమ్మెల్యే తూటాలతో పట్టుబడ్డారు. కర్ణాటక మాజీ ఎమ్మెల్యే, హట్టి బంగారు గనుల కార్పొరేషన్ అధ్యక్షుడు అయిన మానప్ప వజ్జల్ హైదరాబాద్ వెళ్లేందుకు బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.

 అక్కడ నిర్వహించిన తనిఖీల్లో ఆయన వద్ద ఉన్న 16 తూటాలు బయటపడ్డాయి. తనకు తుపాకి లైసెన్స్ ఉందని, తుపాకిని ఇంటిలోనే పెట్టి తూటాలను మాత్రం పొరపాటున పట్టుకొచ్చానని ఆయన అధికారులకు వివరణ ఇచ్చారు. దీంతో తూటాలను స్వాధీనం చేసుకున్న అధికారులు హెచ్చరించి వదిలేశారు. విమాన ప్రయాణానికి అనుమతించారు.
Karnataka
Ex MLA
Manappa vajjal
Bullets
Airport

More Telugu News