Pooja Hegde: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Pooja Hegde says she has been working for periodic movies right from the beginning of her career
  • అన్నీ పీరియాడిక్ మూవీలే అంటున్న పూజ
  • విజయ్ దేవరకొండ 'ఫైటర్' షూటింగ్ అప్ డేట్
  • వెబ్ సిరీస్ లోకి వస్తున్న విజయ్ సేతుపతి
  • పవన్ కల్యాణ్ సినిమాలో ఐశ్వర్య రాజేశ్  
*  కెరీర్ మొదలైనప్పటి నుంచీ తనకి పీరియాడిక్ మూవీలలో నటించే అవకాశం రావడం అదృష్టమని అంటోంది కథానాయిక పూజ హెగ్డే. 'హృతిక్ తో మొహంజదారో, ప్రభాస్ తో రాధే శ్యామ్, రణ్ వీర్ సింగ్ తో సర్కస్.. ఈ చిత్రాలన్నీ పీరియాడిక్ మూవీలే. చాలామందికి కెరీర్ లో ఎప్పుడో వస్తుంది ఇలాంటి సినిమా చేసే అవకాశం. నాకు మొదటి నుంచీ వస్తూనే ఉండడం అదృష్టం" అని చెప్పింది.
*  విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం తదుపరి షెడ్యూలు షూటింగును వచ్చే నెల మూడో వారం నుంచి నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ షెడ్యూలుతో మొత్తం పూర్తవుతుంది. 'ఫైటర్' వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.
*  తమిళ, తెలుగు సినిమాలలో అటు హీరోగా.. ఇటు విలన్ గా నటిస్తూ బిజీగా వున్న విజయ్ సేతుపతి తొలిసారిగా వెబ్ సీరీస్ లో నటిస్తున్నాడు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించే ఈ సీరీస్ లో విజయ్ సేతుపతితో పాటు బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ ప్రధాన పాత్ర పోషిస్తాడు.  
*  పవన్ కల్యాణ్ హీరోగా రూపొందే 'అయ్యప్పనుమ్ కోషియమ్' మలయాళ రీమేక్ లో రానా మరో హీరోగా నటించనున్న సంగతి విదితమే. పవన్ సరసన సాయిపల్లవి ఇందులో నటిస్తుండగా.. రానా పక్కన ఐశ్వర్య రాజేశ్ జంటగా నటిస్తుందని తెలుస్తోంది. దీనికి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు.
Pooja Hegde
Vijay Devarakonda
Vijay Setupati
Pawan Kalyan

More Telugu News