Pawan Kalyan: 'పరశురాం కీ ప్రతీక్ష' రచనను ప్రజల ముందుకు తీసుకువచ్చిన కవితాసింగ్ కు అభినందనలు: పవన్ కల్యాణ్

Pawan Kalyan appreciates Kavita Singh who recites Parasuram Ki Prateeksha
  • తన అభిమాన రచయితగా రాంధారీ దినకర్ ను పేర్కొన్న పవన్
  • ఆయన రాసిన 'పరశురాం కీ ప్రతీక్ష' బాగా ఇష్టమని వెల్లడి
  • ఆ రచనను గానం చేసిన కవితా సింగ్ కు ఫోన్
  • మురిసిపోయిన కవితా సింగ్
జనసేనాని పవన్ కల్యాణ్ పుస్తకాలు ఎక్కువగా చదువుతారన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఓ వీడియోపై తన అభిప్రాయాలు తెలిపారు. తనకు ఎంతో ఇష్టమైన, స్ఫూర్తినిచ్చిన, ప్రఖ్యాత రచయిత రాంధారీ దినకర్ రచించిన 'పరశురాం కీ ప్రతీక్ష' రచనను అర్థవంతంగా వివరించి, మంచి సాహిత్యాన్ని ప్రజల ముందుకు వీడియో రూపంలో అందించిన కవితా సింగ్ కు హృదయపూర్వక అభినందనలు అంటూ స్పందించారు. పవన్ ఆమెను తెలుగు సూపర్ స్టార్ అంటూ అభివర్ణించారు.

కాగా, తన వీడియో పట్ల పవన్ కల్యాణ్ ఫోన్ చేసి అభినందించారని, ఆ క్షణాలు ఎంతో అపురూపం అని కవితా సింగ్ తెలిపారు. పవన్ కల్యాణ్ కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు.
Pawan Kalyan
Kavita Singh
Parasuram Ki Prateeksha
Ramdhari Dinakar

More Telugu News