Chiranjeevi: బిగ్ బాస్ ట్రోఫీ అందించేందుకు ఈసారి కూడా చిరంజీవే!

Chiranjeevi is the chief guest for Bigg Boss season four grand finale
  • గత సీజన్ లో ఫైనల్ ఈవెంట్ కు విచ్చేసిన మెగాస్టార్
  • తన టైమింగ్ తో అందరినీ అలరించిన వైనం
  • ఈసారి కూడా చిరునే ఆహ్వానించిన బిగ్ బాస్
  • నేటితో ముగియనున్న బిగ్ బాస్ నాలుగో సీజన్
  • కాసేపట్లో తేలనున్న విన్నర్
గత మూడ్నెల్లకు పైగా తెలుగు ప్రేక్షకులకు సరైన వినోదం అందించిన బిగ్ బాస్-4 రియాల్టీ షో నేటితో ముగియనుంది. ఇవాళ్టి గ్రాండ్ ఫినాలే ఈవెంట్ కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి విచ్చేశారు. చిరంజీవి గత సీజన్ లోనూ విన్నర్ ట్రోఫీ అందించిన సంగతి తెలిసిందే. తనదైన టైమింగ్ తో నాడు అద్భుతమైన కామెడీ పండించిన చిరు మరోసారి తన మార్కు వినోదం అందించేందుకు వచ్చారు. బిగ్ బాస్ నాలుగో సీజన్ విజేతకు కూడా తన చేతుల మీదుగా ట్రోఫీ అందించనున్నారు.
Chiranjeevi
Bigg Boss Telugu 4
Grand Finale
Chief Guest

More Telugu News