మమతా బెనర్జీ ఫ్యామిలీలో మరో సీఎం లేరు: తృణమూల్ కాంగ్రెస్
- టీఎంసీలో వారసత్వ రాజకీయాలు లేవు
- బీజేపీలోనే బంధుప్రీతి ఉంది
- టీఎంసీ లోక్ సభ నేత కల్యాణ్ బెనర్జీ
"సుబేంధు అధికారి రాజకీయాల గురింఃచి మాట్లాడుతున్నారు. ఆయనకు బీసీసీఐ కార్యదర్శి జైషాకు ఉన్న సంబంధం ఏంటి? ఓ కేంద్ర మంత్రి కుమారుడితో ఆయనకున్న బంధుత్వం ఏంటి?" అని ఆయన ప్రశ్నించారు. డైమండ్ హార్బర్ ఎంపీ, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని తృణమూల్ తదుపరి సీఎంగా ప్రమోట్ చేయాలని నిర్ణయించుకుందని సుబేందు అధికారి ఆరోపించిన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.