Tamannaah: అలా పిలిస్తే తనకు నచ్చదంటున్న తమన్నా!

Tamanna says she doesnt like to be called Milky Beauty
  • తారలకు అభిమానుల రకరకాల బిరుదులు 
  • తమన్నాకు 'మిల్కీ బ్యూటీ' అనే టైటిల్
  • మేని ఛాయను బట్టి పిలవడం ఇష్టం లేదట
  • ప్రతిభను బట్టి పేర్లు పెట్టాలంటున్న తమ్మూ    
మన హీరోలు, హీరోయిన్లకు వాళ్ల అభిమానులు రకరకాల బిరుదులు ఇచ్చుకుంటూవుంటారు. అలాగే, పలు సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించిన గ్లామర్ తార తమన్నాకు కూడా ఒక టైటిల్ వుంది. అదేమిటంటే.. మిల్కీ బ్యూటీ! అందుకే, తమన్నా గురించి చెప్పేటప్పుడు ముందుగా మిల్కీ బ్యూటీ అనే బిరుదు తగిలించేస్తూ వుంటారు.

అయితే, ఆ టైటిల్ అంటే తమన్నాకు ఎంతమాత్రమూ ఇష్టం లేదట. ఈ విషయాన్ని ఈ ముద్దుగుమ్మ తాజాగా వెల్లడించింది. "ఫ్యాన్స్ ప్రేమతోనే అలా పిలుస్తున్నారు. అది నాకు తెలుసు. కానీ, ఆ పేరు నాకు నచ్చదు. మేని ఛాయను బట్టి ఇలా పేర్లు పెట్టడం తప్పనే చెప్పాలి. మన దేశంలో చాలామందిలో ఇలా వైట్ కలర్ స్కిన్ పట్ల అదో రకమైన ఆకర్షణ, వ్యామోహం వున్నాయి. ఇది మంచిది కాదు. అందుకే, మేని ఛాయను బట్టి కాకుండా, మన ప్రతిభను బట్టి టైటిల్స్ ఇస్తే బాగుంటుంది" అని చెప్పింది తమ్మూ.  
Tamannaah
Milky Beauty
Fans
White Skin

More Telugu News