Visakha Steel Plant: విశాఖ ఉక్కు కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం... వీడియో ఇదిగో!

Huge fire accident in Visakha steel plant
  • విశాఖలో మరో ప్రమాదం
  • స్టీల్ ప్లాంట్ లో నేలపాలైన ద్రవరూప ఉక్కు
  • పెద్ద ఎత్తున మంటలు
  • నలుగురికి గాయాలు
  • కోట్లలో నష్టం జరిగిందని అంచనా!
ఏపీ తూర్పు తీర నగరం విశాఖపట్నంలో మరో ప్రమాదం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉక్కు కర్మాగారంలోని రెండో స్టీల్ మెల్టింగ్ షాప్ (ఎస్ఎమ్ఎస్)లో లాడిల్ కు ఉన్న కొక్కేలు తెగిపోవడంతో పెద్ద మొత్తంలో ద్రవరూప ఉక్కు నేలపాలైంది. దాంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు సిబ్బందికి గాయాలయ్యాయి. కోట్ల రూపాయల మేర నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. కాగా, ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పడంలో నిమగ్నమయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
Visakha Steel Plant
Fire Accident
Visakhapatnam
Andhra Pradesh

More Telugu News