Mahabubnagar District: మహబూబ్ నగర్ జిల్లాలో ప్రేమికుల ఆత్మహత్య

Lovers commits suicide in Mahaboobnagar District
  • ప్రేమికులది నారాయణపేట జిల్లా నర్వా మండలం
  • గత ఏడాదిగా ప్రేమించుకుంటున్న జంట
  • కులాలు వేరు కావడంతో ఒప్పుకోని పెద్దలు
మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నారు. ఉంద్యాల గ్రామ సమీపంలోని పొలాల్లో వారు శీతల పానీయంలో విషం కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రేమికుల్లో బాలిక మైనర్ కావడం గమనార్హం.

పోలీసులు చెపుతున్న వివరాల ప్రకారం... నారాయణపేట జిల్లా నర్వా మండలం లంకాల గ్రామానికి చెందిన శేఖర్ (23), అదే గ్రామానికి చెందిన బాలిక ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. బాలిక వయసు 16 ఏళ్లు. అయితే కులాలు వేరు కావడంతో పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించలేదు. దీంతో, ఈనెల 15 రాత్రి వీరిద్దరూ బైక్ పై ఊరి నుంచి వచ్చేశారు.

ఈరోజు ఉంద్యాలకు చెందిన రైతులు పొలాలకు వెళ్తున్న సమయంలో విగత జీవులుగా ఉన్న ప్రేమికులను గమనించారు. వెంటనే చింతకుంట పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారన్న వార్తతో లంకాల గ్రామంలో విషాదం నెలకొంది.
Mahabubnagar District
Lovers
Suicide

More Telugu News