ఖుష్బూకు కొత్త బాధ్యతలు అప్పగించిన బీజేపీ

17-12-2020 Thu 20:52
  • ఇటీవలే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన ఖుష్బూ
  • చెపాక్ నియోజకవర్గ ఇన్చార్జిగా నియామకం
  • త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు
  • 234 నియోజకవర్గాలకు ఇన్చార్జిలను నియమించిన బీజేపీ
  • జాబితా విడుదల
BJP appointed Khushboo as Chepauk constituency incharge

ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన సినీ నటి ఖుష్బూను కొత్త బాధ్యతలు వరించాయి. ఖుష్బూను చెపాక్-ట్రిప్లికేన్ అసెంబ్లీ స్థానం ఎన్నికల ఇన్చార్జిగా బీజేపీ నియమించింది. త్వరలోనే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో మొత్తం 234 స్థానాలకు బీజేపీ ఇన్చార్జిలను నియమించింది. ఈ మేరకు ఇవాళ జాబితా విడుదల చేశారు.

 2021 వేసవిలో తమిళనాట ఎన్నికలు నిర్వహించనున్నారు. 234 స్థానాలకు ఎన్నికలు జరపనుండగా 118 స్థానాలు గెలిచిన పార్టీ అధికార పీఠం చేజిక్కించుకుంటుంది. ఈసారి అధికార అన్నాడీఎంకే, విపక్ష డీఎంకేతోపాటు బీజేపీ, కమల్ హాసన్ మక్కళ్ నీది మయ్యం, రజనీకాంత్ పార్టీలు కూడా బరిలో ఉంటాయన్న నేపథ్యంలో పోరు రసవత్తరంగా ఉండనుంది.