Balakrishna: బాలకృష్ణ కోసం కథను సిద్ధం చేసిన మాస్ చిత్రాల దర్శకుడు

Gopichand Malineni ready with script for Balakrishna
  • ప్రస్తుతం బోయపాటితో బాలకృష్ణ సినిమా  
  • ఇంకా ఖరారు కాని బాలయ్య తదుపరి చిత్రం
  • కథ రెడీ చేసిన దర్శకుడు గోపీచంద్ మలినేని
  • మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మాణం?  
బాలకృష్ణ సినిమా అనగానే అందులో మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి. భారీ యాక్షన్ ఎపిసోడ్లు.. పవర్ ఫుల్ డైలాగులు.. పక్కా మాస్ సాంగ్స్ తో ఆయా సినిమాలు రూపొందుతాయి. అప్పుడే ఆయన విశేష అభిమానగణం ఆ సినిమాను ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న మూడో చిత్రం కూడా ఇదే కోవలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది.

ఇక దీని తర్వాత బాలయ్య చేసే సినిమా ఏమిటి? అన్నది ఇంకా వెల్లడికాలేదు. గత కొంతకాలంగా ఆయన ఆయా దర్శకులు చెబుతున్న కొత్త కథలు  వింటున్నప్పటికీ, ఇంకా ఏదీ ఖరారు కాలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో బాలకృష్ణ కోసం మాస్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని ఓ సబ్జెక్టును తయారుచేసినట్టు సమాచారం.

ఇప్పటికే ఆయన ఈ కథను ప్రముఖ చిత్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారికి చెప్పినట్టు, వారికి బాగా నచ్చినట్టు తెలుస్తోంది. త్వరలో బాలయ్యకు ఆ కథను వినిపించడానికి వీరు సమాయత్తమవుతున్నారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే భారీ బడ్జెట్టుతో ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేసున్నారు.
Balakrishna
Boyapati Sreenu
Gopichand Malineni

More Telugu News