Vivek Atreya: 'బ్రోచేవారెవరురా' చిత్రాన్ని హిందీలో నిర్మిస్తున్న అజయ్ దేవగణ్

Ajay Devagan to remake Telugu hit Brochevarevarura in Hindi
  • వివేక్ ఆత్రేయ రూపొందించిన 'బ్రోచేవారెవరురా'
  • తెలుగులో 7 కోట్లలో నిర్మిస్తే 20 కోట్ల వసూలు
  • హిందీలో హీరోగా సన్నీ డియోల్ తనయుడు కరణ్  
  • దేవన్ ముంజల్ దర్శకత్వం.. 'వెల్లీ'గా టైటిల్ ఖరారు
ఇటీవలి కాలంలో తెలుగులో వస్తున్న హిట్ చిత్రాలను హిందీలో రీమేక్ చేయడం ఊపందుకుందనే చెప్పచ్చు. ఒక మంచి హిట్ సినిమా వస్తే కనుక హిందీ నిర్మాతలు వదలడం లేదు. రీమేక్ హక్కుల కోసం భారీ మొత్తాలను ఆఫర్ చేసి సొంతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో తెలుగు హిట్ సినిమా హిందీలోకి రీమేక్ అవుతోంది.

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఆమధ్య వచ్చిన 'బ్రోచేవారెవరురా' క్రైమ్ కామెడీ సినిమా  ప్రేక్షకాదరణ పొంది హిట్టయింది. శ్రీవిష్ణు హీరోగా నివేద థామస్, నివేద పేతురాజ్ హీరోయిన్లుగా ఏడు కోట్ల బడ్జెట్టులో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద 20 కోట్లు వసూలు చేసిందని అప్పట్లో వార్తలొచ్చాయి. ఇప్పుడీ చిత్రం రీమేక్ హక్కులను ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ తీసుకున్నారు.

అజయ్ దేవగణ్ నిర్మాతగా వ్యవహరించే ఈ హిందీ రీమేక్ లో సన్నీ డియోల్ తనయుడు కరణ్ డియోల్, సన్నీ కజిన్ అభయ్ డియోల్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. దేవన్ ముంజల్ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి హిందీలో 'వెల్లీ' అనే టైటిల్ని కూడా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
Vivek Atreya
Srivishnu
Ajay Devagan
Nivetha Thamos

More Telugu News