Mohan Raja: మెగాస్టార్ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ కొట్టేసిన మోహన్ రాజా

Chiranjeevi film Lucifer Telugu Remake Will Be Directed By Jayam Mohanraja
  • చిరంజీవి 153వ చిత్రం 'లూసిఫర్'కు దర్శకుడు ఖరారు
  • 'హనుమాన్ జంక్షన్' సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన మోహన్ రాజా
  • 'హిట్లర్'కు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన రాజా
చిరంజీవి 153వ చిత్రం 'లూసిఫర్'కు దర్శకుడు ఖరారయ్యారు. మోహన్ రాజాను ఈ సినిమాకు డెరెక్టర్ గా చిత్ర యూనిట్ ఎంపిక చేసింది. రామ్ చరణ్ హీరోగా వచ్చిన 'ధృవ' సినిమా తమిళ మాతృక 'తని ఒరువన్'కు మోహన్ రాజానే దర్శకత్వం వహించారు. 'లూసిఫర్' చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి పట్టాలపైకి ఎక్కనుంది. ప్రస్తుతం చిరంజీవి 'ఆచార్య' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

మరోవైపు, తమిళ సినీ పరిశ్రమకు చెందిన మోహన్ రాజా (నిర్మాత ఎడిటర్ మోహన్ తనయుడు) 'హనుమాన్ జంక్షన్' సినిమా ద్వారా తెలుగు సీనీ పరిశ్రమకు దర్శకుడిగా పరిచయమయ్యారు. తెలుగులో విజయవంతమైన పలు చిత్రాలను ఆయన తమిళంలో రీమేక్ చేశారు. చిరంజీవి నటించగా, తన తండ్రి ఎడిటర్ మోహన్ నిర్మించిన 'హిట్లర్' సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేశారు. చిరంజీవిని డైరెక్ట్ చేయడంపై ఆయన స్పందిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మెగాస్టార్ సినిమాకు దర్శకత్వం వహించడానికి తనకు ఇంత కాలం పట్టిందని చెప్పారు. ఈ సినిమాకు ఎన్వీ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించనున్నారు.
Mohan Raja
Chiranjeevi
Lucifer
Tollywood

More Telugu News