కొత్త బావ కోసం బారాత్... ఫొటోలు పంచుకున్న వరుణ్ తేజ్

15-12-2020 Tue 19:27
  • మెగా ఫ్యామిలీలో ముగిసిన పెళ్లి సందడి
  • ఇటీవలే నిహారిక పెళ్లి
  • రాజస్థాన్, ఉదయ్ పూర్ లో వివాహం
  • తాజాగా బారాత్ ఫొటోలు విడుదల
  • ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తున్న వరుణ్ తేజ్, సాయితేజ్
Varuntej shares his sister marriage Baraat pics

ఇటీవలే మెగా కుటుంబంలో పెళ్లి సందడి ముగిసింది. నాగబాబు తనయ నిహారిక వివాహం మాజీ ఐజీ కుమారుడు జొన్నలగడ్డ చైతన్యతో జరిగింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ ఈ పెళ్లికి వేదికగా నిలిచింది. ఈ క్రమంలో, నిహారిక సోదరుడు వరుణ్ తేజ్ ఈ పెళ్లి బారాత్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'కొత్త బావ కోసం బారాత్' అంటూ ట్వీట్ చేశారు. ఓ జీపులో చైతన్య ఊరేగింపుగా వస్తుండగా, వరుణ్ తేజ్, సాయితేజ్ తదితరులు ఎంతో ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తుండడం ఆ ఫొటోల్లో చూడొచ్చు.