Putin: ప్రపంచ శ్రేయస్సు కోసం అమెరికాకు సహకరిస్తాం: పుతిన్

Will work along with US says Putin
  • జో బైడెన్ ను అభినందించిన పుతిన్
  • ఇరు దేశాలు బాధ్యతాయుతంగా ముందుకు వెళ్తాయన్న రష్యా అధ్యక్షుడు
  • బైడెన్ ను అధ్యక్షుడిగా ప్రకటించిన ఎలక్టోరల్ కాలేజి
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన జో బైడెన్ ను ఇంత వరకు రష్యా అభినందించని సంగతి తెలిసిందే. బైడెన్ గెలిచినట్టు అమెరికా ఎలక్టోరల్ కాలేజీ అధికారికంగా ప్రకటించిన మరుసటి రోజు రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. అమెరికా అధ్యక్ష బాధ్యతలను స్వీకరించనున్న బైడెన్ కు అభినందనలు తెలిపారు.

రష్యా, అమెరికా దేశాల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ... ప్రపంచం ముందున్న సమస్యలను ఎదుర్కోవడం కోసం ఇరు దేశాలు బాధ్యతాయుతంగా ముందుకు వెళ్తాయనే ఆశాభావాన్ని పుతిన్ వ్యక్తం చేశారు. ఇరు దేశాల ప్రయోజనాల కోసం, ప్రపంచ సమాజ శ్రేయస్సు కోసం అమెరికాకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు. ఎలెక్టోరల్ కాలేజి బైడెన్ ను అధ్యక్షుడిగా ప్రకటించిన అనంతరం అన్ని దేశాలు ఆయనకు అభినందనలు తెలుపుతున్నాయి.
Putin
Russia
Joe Biden
USA

More Telugu News