Budda Venkanna: విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రకు దావూద్ ఇబ్రహీం లాంటి వాడు: బుద్ధా వెంకన్న

Budda Venkanna terms Vijayasai Reddy as Dawood Ibrahim
  • ట్రస్టుతో ప్రజలను ఇబ్బందులుపెడుతున్నారని వ్యాఖ్యలు
  • మూడు రాజధానులతో విద్వేషాలు రగుల్చుతున్నారని ఆరోపణ
  • ప్రజలపై భారం వేసే ఏకైక సీఎం జగన్ అని విమర్శలు
  • జమిలి ఎన్నికల్లో టీడీపీదే గెలుపు అని వ్యాఖ్యలు
  • ఎవరొచ్చినా కలుపుకుని పోతామని వెల్లడి
టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వైసీపీ అధినాయకత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రకు దావూద్ ఇబ్రహీం లాంటి వాడని అభివర్ణించారు. ట్రస్టు పెట్టి ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకే మూడు రాజధానులు అని తెలిపారు. ప్రజల మీద పెనుభారం వేసే ఏకైక సీఎం జగన్ మాత్రమేనని అన్నారు. జమిలి ఎన్నికలు తప్పకుండా వస్తాయని, అప్పుడు టీడీపీదే గెలుపు అని బుద్ధా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలకు టీడీపీ సిద్ధంగా ఉందని, తమతో ఎవరొచ్చినా కలుపుకుని పోతామని చెప్పారు.
Budda Venkanna
Vijayasai Reddy
Dawood Ibrahim
Jagan
Telugudesam
Andhra Pradesh

More Telugu News