వావ్.. ఏమి'టీ' రుచి... అల్లం ఛాయ్ తాగుతూ సెల్ఫీ పోస్ట్ చేసి ఎమ్మెల్సీ కవిత!

15-12-2020 Tue 13:00
  • అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భంగా ట్వీట్
  • వేడి అల్లం ఛాయ్ తాగితే ఉపశమనం కలుగుతుందని వ్యాఖ్య
  • టీ తాగుతూ సెల్ఫీ తీసుకుని ఫొటోలను షేర్ చేయాలని పిలుపు
kavita tweets about tea
ఛాయ్ గురించి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసక్తికర ట్వీట్ చేశారు. అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భంగా అల్లం ఛాయ్ తాగుతూ ఫొటో తీసుకుని ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. తీరిక లేకుండా గడుపుతోన్న సమయంలో వేడి వేడి అల్లం ఛాయ్ తాగితే చాలా ఉపశమనాన్ని పొందినట్లు ఉంటుందని ఆమె తెలిపారు.

కప్పు టీ తాగుతుండగా తీసుకున్న సెల్ఫీని తాను పోస్టు చేస్తున్నానని, తన ఫాలోవర్లు కూడా టీ తాగుతూ సెల్ఫీ తీసుకుని ఫొటోలను షేర్ చేస్తే తాను సంతోషిస్తానని పేర్కొన్నారు. ఆమె కోరినట్లుగానే అప్పుడే కొందరు ఛాయ్ తాగుతూ ఫొటోలు దిగి రిప్లై ఇచ్చారు. కొందరు గతంలో ఛాయ్ తాగుతూ తీసుకున్న ఫొటోలను కూడా పోస్ట్ చేశారు.