Rakul Preet Singh: ఇలాంటి పుకార్లు రావడం ఇదే తొలిసారి కాదు: రకుల్ ప్రీత్ సింగ్

This is not the first time such rumors have surfaced on me says Rakul Preet Singh
  • రకుల్ కు ఒక వ్యక్తి ఇల్లు ఇచ్చాడని ప్రచారం
  • ఇక నేను పని చేయాల్సిన అవసరం ఏముందన్న రకుల్
  • పుకార్లను పట్టించుకోవడం మానేశానని వ్యాఖ్య
రకుల్ ప్రీత్ సింగ్ కు దక్షిణాదినే కాకుండా, ఉత్తరాదిన కూడా పెద్ద సంఖ్యలోనే అభిమానులు ఉన్నారు. బాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ ఆమె బిజీగా ఉంటోంది. సినిమాలను పక్కన పెడితే... రకుల్ వ్యక్తిగత జీవితం కూడా ఇటీవలి కాలంలో వివాదాస్పదంగా మారింది. ఆమెపై వచ్చినన్ని పుకార్లు, వార్తలు మరే హీరోయిన్ పై కూడా వచ్చుండవేమో. బాలీవుడ్ డ్రగ్స్ కేసు అంశంలో రకుల్ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగింది. మరోవైపు ఆమెకు ఒక వ్యక్తి ఇల్లు గిఫ్ట్ గా ఇచ్చాడంటూ.. పలు రకాల కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

ఈ అంశంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ, మన గురించి పుకార్లు పుట్టించే వ్యక్తులు ఒక్క క్షణం కూడా మన గురించి ఆలోచించరని చెప్పింది. నేను ఉంటున్న ఇల్లు కూడా ఒక వ్యక్తి గిఫ్ట్ గా ఇచ్చాడని ప్రచారం చేస్తున్నారని... ఎవరో తనకు ఇంటిని గిఫ్ట్ గా ఇచ్చినప్పుడు, ఇక తాను ఇలా పని చేసుకోవలసిన అవసరం ఏముందని ప్రశ్నించింది. తనపై ఇలాంటి పుకార్లు రావడం ఇదే తొలిసారి కాదని చెప్పింది. అందుకే పుకార్లను పట్టించుకోవడాన్ని తాను ఎప్పుడో మానేశానని తెలిపింది. పుకార్లపై మనం స్పందించాల్సిన అవసరం లేదని... మన పనే అన్నింటికీ సమాధానం చెపుతుందని వ్యాఖ్యానించింది.
Rakul Preet Singh
Bollywood
Tollywood
House

More Telugu News