Raghu Rama Krishna Raju: అమరావతికి జై కొట్టిన రఘురామకృష్ణరాజు
- ఈ నెల 17తో అమరావతి ఉద్యమానికి ఏడాది పూర్తి
- అమరావతే ఏపీకి రాజధాని అంటూ సోము వ్యాఖ్యలు
- సోము వీర్రాజు వ్యాఖ్యలను స్వాగతిస్తూ రఘురామ ట్వీట్
- సోము వ్యాఖ్యలతో భరోసా కలుగుతోందని వెల్లడి
- త్వరలోనే అమరావతి స్వప్నం వాస్తవరూపం దాల్చుతుందని ఉద్ఘాటన
అమరావతి రైతులు, మహిళలు సాగిస్తున్న ఉద్యమానికి ఈ నెల 17తో ఏడాది పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ట్విట్టర్ లో 'జై అమరావతి' అంటూ స్పందించారు. అమరావతి ఉద్యమం మొదటి సంవత్సరాన్ని పూర్తిచేసుకునేందుకు రెండ్రోజుల ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు అమరావతి మాత్రమే ఏపీ రాజధాని అని చాటుతున్నాయని పేర్కొన్నారు. అది కూడా మోదీ ప్రతినిధిగా ఈ మాట చెబుతున్నానంటూ సోము వీర్రాజు ప్రధాని పేరు ప్రస్తావించడం చూస్తుంటే అమరావతి రాజధాని అవుతుందన్న నిశ్చితాభిప్రాయం కలుగుతోందని తెలిపారు.
అమరావతి ఉద్యమం 365వ రోజున ఇతర పార్టీలతో కలిసి బీజేపీ కూడా ఉద్యమంలో పాలుపంచుకుంటుందని భావించవచ్చని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. త్వరలోనే ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి స్వప్నం వాస్తవరూపం దాల్చుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.