Bony Kapoor: అత్యధిక ట్వీట్లతో రికార్డు సృష్టించిన పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్'

Bony Kapoor says Vakeel Saab movie most tweeted Telugu movie this year
  • 'పింక్' చిత్రం రీమేక్ గా తెరకెక్కుతున్న 'వకీల్ సాబ్'
  • అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రలో పవన్ కల్యాణ్
  • 'వకీల్ సాబ్' చిత్ర సమర్పకుడిగా వ్యవహరిస్తున్న బోనీ కపూర్
  • త్వరలోనే పవర్ ప్రభంజనం వస్తుంది అంటూ ట్వీట్
పవన్ కల్యాణ్ స్టామినా చాటే రీతిలో 'వకీల్ సాబ్' సినిమా విడుదలకు ముందే సోషల్ మీడియాలో హవా సాగిస్తోంది. బాలీవుడ్ లో హిట్టయిన 'పింక్' చిత్రం రీమేక్ గా వస్తున్న ఈ వకీల్ సాబ్ కు ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఇవాళ ఆసక్తికర ట్వీట్ చేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' చిత్రం 2020లో అత్యధిక ట్వీట్లతో రికార్డు సృష్టించిందని వెల్లడించారు. త్వరలోనే పవర్ సత్తా ఏంటో చూస్తారని పేర్కొన్నారు. 'పింక్' చిత్రంలో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను 'వకీల్ సాబ్' లో పవన్ పోషిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
Bony Kapoor
Vakeel Saab
Tweet
Telugu Movie
Tollywood

More Telugu News