Jagan: పోలవరం ప్రాజెక్టు ఆర్థిక అంశాలన్నీ పరిష్కారమవుతాయి... నిర్వాసితులకు న్యాయం చేస్తాం: సీఎం జగన్

  • పోలవరం సందర్శించిన సీఎం జగన్
  • ఘనస్వాగతం పలికిన మంత్రులు
  • ఏరియల్ వ్యూ ద్వారా నిర్మాణ పనుల పరిశీలన
  • అధికారులతో సమీక్ష
  • 2022 ఖరీఫ్ నాటికి నీరందిస్తామని వెల్లడి
CM Jagan visits Polavaram project site

ఏపీ సీఎం జగన్ ఇవాళ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు పనులను పరిశీలించిన ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన వెంట ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఇతర మంత్రులు కూడ వున్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, పోలవరం నిర్వాసితులకు తప్పకుండా న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థికపరమైన అంశాలన్నీ పరిష్కారం అవుతాయని తెలిపారు. 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ద్వారా నీరందిస్తామని హామీ ఇచ్చారు.

అంతకుముందు, హెలికాప్టర్ లో పోలవరం చేరుకున్న సీఎంకు ఘనస్వాగతం లభించింది. మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఆళ్ల నాని, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత తదితరులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు.

More Telugu News