Gorantla Butchaiah Chowdary: పోలవరంలో చంద్రబాబు కట్టిన గ్రాఫిక్స్ చూడ్డానికి వెళ్లిన సీఎం జగన్ కు ధన్యవాదాలు: గోరంట్ల వ్యంగ్యం

TDP leader Gorantla satires on CM Jagan
  • నేడు సీఎం జగన్ పోలవరం సందర్శన
  • పోలవరం గ్రాఫిక్స్ అన్నారని గోరంట్ల వెల్లడి
  • ఇప్పుడెలా పర్యటిస్తున్నారంటూ నిలదీసిన వైనం
  • ఎఫ్2 సీఎం అంటూ వ్యాఖ్యలు 
ఏపీ సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టును సందర్శించడం పట్ల టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. సోమవారం రోజున పోలవరంలో చంద్రబాబు కట్టిన గ్రాఫిక్స్ చూడ్డానికి వెళ్లిన సీఎం జగన్ కు ధన్యవాదాలు అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. పోలవరం ప్రాజెక్టును గ్రాఫిక్స్ అన్నారు... మరి ఇప్పుడు ఏకంగా పర్యటనలు ఏంటో అని వ్యాఖ్యానించారు. అందుకే ఎఫ్2 సీఎం అంటున్నారని, ఫేక్ అండ్ ఫెయిల్యూర్ సీఎం అని విమర్శించారు. కొంపదీసి ప్రాజెక్టుకు కూడా రంగులు వేయిస్తారా? అని ఎద్దేవా చేశారు.
Gorantla Butchaiah Chowdary
Jagan
Polavaram Project
Chandrababu
Graphics
Telugudesam
Andhra Pradesh

More Telugu News