Telangana: తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసుల సంఖ్య

  • నిన్న రాష్ట్రవ్యాప్తంగా 384 కేసుల నమోదు
  • కరోనాకు ముగ్గురు బలి
  • ఇంకా యాక్టివ్‌గా 7,380 కేసులు
coronaviurs slow down in Telangana

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. నిన్న రాష్ట్రవ్యాప్తంగా 384 పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్యఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన బులెటిన్‌లో తెలిపింది. వీటిలో 101 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వెలుగుచూశాయి. నిన్న కరోనా బారినపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరితో కలిపి ఇప్పటి వరకు ఈ మహమ్మారికి బలైన వారి సంఖ్య 1,496కు పెరిగింది.

ఇక కొవిడ్‌కు చికిత్స పొందుతూ నిన్న 631 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారి నుంచి బయటపడిన వారి సంఖ్య 2,69,232కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 61,57,683 నిర్ధారణ పరీక్షలు చేయగా, గత రాత్రి 8 గంటల వరకు 28,980 మందిని పరీక్షించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 7,380 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. వీరిలో 5,298 మంది హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు.

More Telugu News