Corona Virus: షాకిస్తున్న వర్మ 'కరోనా వైరస్' కలెక్షన్లు!

Disaster Collections for Varma Corona Virus
  • థియేటర్లు తెరచుకున్న తరువాత తొలి తెలుగు చిత్రం
  • తొలి రోజున రూ. 2 లక్షలు దాటని కలెక్షన్లు
  • పదుల సంఖ్యలో కూడా లేని ప్రేక్షకులు
'కరోనా వైరస్'... లాక్ డౌన్ తరువాత సినిమా హాల్స్ తిరిగి ప్రారంభమైన వేళ, మొట్టమొదట విడుదలైన తెలుగు సినిమా. రామ్ గోపాల్ వర్మ స్వయంగా కథ సమకూర్చి, నిర్మించగా, అగస్త్య మంజు దర్శకత్వం వహించారు. గత వారం ఈ సినిమా విడుదల కాగా, తొలి రోజు కలెక్షన్లు అత్యంత ఘోరంగా నిలిచాయి.

  సినీ ప్రేక్షకులకు, థియేటర్ యాజమాన్యాలకు షాకిస్తూ, తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజున కేవలం రూ.1.50 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకూ మాత్రమే కలెక్షన్లు వచ్చాయని తెలుస్తోంది. లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో ఓ ఇంట్లోని వారిని కరోనా వైరస్ ఎలా భయపెట్టిందన్న కథాంశంతో ఈ చిత్రం తయారైంది. ఈ సినిమా ప్రపంచంలోనే కరోనాపై తీసిన తొలి చిత్రమని వర్మ ఎంతగా ప్రచారం చేసుకున్నా, ఒక్కో థియేటర్ లో పదుల సంఖ్యలో కూడా ప్రేక్షకులు లేరని సినీ విశ్లేషకులు అంటున్నారు.

ఇక, ఈ నెల 25న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన రొమాంటిక్ డ్రామా 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రేక్షకులను మళ్లీ థియేటర్ల వైపు రప్పిస్తుందని యాజమాన్యాలు భావిస్తున్నాయి.
Corona Virus
Ram Gopal Varma
Collections

More Telugu News