Jana Reddy: ఎవరు పీసీసీ అధ్యక్షుడైనా నాకు అభ్యంతరం లేదు: జానారెడ్డి

  • తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ పదవికోసం కసరత్తులు
  • తనకు ఆసక్తి లేదన్న జానారెడ్డి
  • నూతన పీసీసీ చీఫ్ కు సహకరిస్తానని వెల్లడి
  • వచ్చే ఎన్నికల్లో ఫలితం ఎవరూ ఊహించలేరని వ్యాఖ్యలు
  • కాంగ్రెస్ ప్రజలకు దగ్గరవుతోందని వివరణ
Janareddy opines on PCC Chief

తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో ఇప్పుడందరి దృష్టి పీసీసీ అధ్యక్ష పదవిపై కేంద్రీకృతమై ఉంది. ఇదే అంశంపై సీనియర్ నేత జానారెడ్డి స్పందించారు. తనకు పీసీసీ అధ్యక్ష పదవిపై ఆసక్తి లేదని స్పష్టం చేశారు. పార్టీ ఎవర్ని పీసీసీ అధ్యక్షుడిగా నియమించినా తనకు అభ్యంతరం లేదని, నూతన పీసీసీ చీఫ్ కు సహకరిస్తానని, అందరం కలసికట్టుగా పనిచేస్తామని చెప్పారు.

అంతేకాదు, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా, తాము అందరం కృషి చేస్తామని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో అనూహ్యరీతిలో ప్రజాతీర్పు ఉంటుందని జానారెడ్డి జోస్యం చెప్పారు. నిజాయతీగా ఉంటేనే ప్రజలు స్వాగతిస్తారని, గత ఐదు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేరువ అవుతోందని అన్నారు.

More Telugu News