Vijayashanti: మోసాల కేసీఆర్ ను ఢిల్లీలో ఎవరూ నమ్మే పరిస్థితి లేదు: విజయశాంతి

Vijayasanthi fires on KCR
  • ఢిల్లీలో కేంద్రం పెద్దలతో కేసీఆర్ సమావేశాలు
  • కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై విజయశాంతి స్పందన
  • సీఎం ప్రోటోకాల్ తో అపాయింట్ మెంట్ తీసుకున్నారని వెల్లడి
  • ప్రజలను బకరాలు చేసే ప్రయత్నమన్న విజయశాంతి
  • కేసీఆర్ సర్కారు కూలడం ఖాయమని వ్యాఖ్యలు
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో పర్యటించి కేంద్రం పెద్దలతో సమావేశమైన నేపథ్యంలో బీజేపీ నేత విజయశాంతి స్పందించారు. మోసాల కేసీఆర్ ను ఢిల్లీలో ఎవరూ నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు. సీఎంగా తన ప్రోటోకాల్ తో అపాయింట్ మెంట్ తీసుకుని ప్రజలను బకరాలు చేసేందుకే ఈ ప్రయత్నం అని ఆరోపించారు. త్వరలోనే అవినీతి ఆరోపణలు రుజువు అవుతాయని స్పష్టం చేశారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కూలడం ఖాయం అని వ్యాఖ్యానించారు.
Vijayashanti
KCR
New Delhi
Telangana

More Telugu News