వెంకటేశ్ పుట్టినరోజు స్పెషల్.. ‘ఎఫ్ 3’ నుంచి ఆసక్తికర పోస్టర్ విడుదల

13-12-2020 Sun 12:15
  • అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 3’ సినిమా
  • రెండు ట్రాలీల నిండా వెంకటేశ్, వరుణ్ తేజ్ డబ్బు
  • పూర్తి స్థాయి కామెడీని పంచడానికి రెడీ అవుతోన్న ఎఫ్ 3
f3 poster releases

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన  ‘ఎఫ్ 2’ సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘ఎఫ్ 3’ సినిమా రూపుదిద్దుకుంటోంది. వెంక‌టేశ్‌, వ‌రుణ్ తేజ్‌ హీరోలుగా రూపుదిద్దుకుంటోన్న ఈ మల్టీస్టారర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రోజు వెంకటేశ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి పోస్టర్ విడుదల చేశారు.

ఇందులో రెండు ట్రాలీల నిండా వెంకటేశ్, వరుణ్ తేజ్ డబ్బు తీసుకెళ్తున్నారు. పూర్తి స్థాయి కామెడీని పంచుతూ ఎఫ్ 3తో మరోసారి హిట్ కొట్టాలని ఈ హీరోలు భావిస్తున్నారు. కాగా, దిల్‌ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

కాగా, వెంకటేశ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేశ్ బాబుతో పాటు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఎఫ్ 3 కోసం ఎదురు చూస్తున్నామని ట్వీట్లు చేశారు.