KCR: ముగిసిన కేసీఆర్ ఢిల్లీ పర్యటన.. హైదరాబాద్‌కు పయనం

Telangana CM KCR Returns from Delhi
  • ఢిల్లీ పర్యటనలో బిజీగా గడిపిన కేసీఆర్
  • పలువురు కేంద్రమంత్రులతో భేటీ
  • అభివృద్ధి నిధులు విడుదల చేయాలని అభ్యర్థన
ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నేడు పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు పయనమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న సీఎం హస్తినలో బిజీబిజీగా గడిపారు. ప్రధాని, కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలు, పరిణామాలపై చర్చించారు. శుక్రవారం సాయంత్రం కేంద్ర జలశక్తి, హోంశాఖ మంత్రులను కలిసిన కేసీఆర్, నిన్న ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రితో భేటీ అయ్యారు.

రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన ఆరు విమానాశ్రయాలు, ఇతర అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను త్వరితగతిన విడుదల చేయాలని కోరారు. హైదరాబాద్ శివారులో నిర్మించ తలపెట్టిన ఫార్మాసిటీ శంకుస్థాపనకు రావాల్సిందిగా ప్రధాని మోదీని కేసీఆర్ ఆహ్వానించారు.
KCR
Narendra Modi
New Delhi
Telangana

More Telugu News