Idupulapaya: ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం..  విద్యార్థి ఆత్మహత్య

Student commits suicide in Idupulapaya IIIT
  • హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకున్న మనోజ్
  • సెకండ్ సెమిస్టర్ లో ఫెయిల్ కావడంతో మనస్తాపం 
  • మృతుడిది అనంతపురం జిల్లా హిందూపురం
కడప జిల్లా ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో విషాదం నెలకొంది. సాయి మనోజ్ అనే విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. సెకండ్ సెమిస్టర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన మనోజ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. హాస్టల్ గదిలోని ఫ్యాన్ కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మనోజ్ ది అనంతపురం జిల్లా హిందూపురం అని గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు క్యాంపస్ కు చేరుకున్నారు. ఘటనా స్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తును ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Idupulapaya
Student
Suicide

More Telugu News