Fire Accident: బొల్లారం పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం.... చెల్లాచెదురైన కార్మికులు

Huge fire accident in Bollaram industrial area
  • వింధ్యా ఆర్గానిక్స్ పరిశ్రమలో పేలుడు
  • ఎగసిపడిన మంటలు
  • భయంతో పరుగులు తీసిన కార్మికులు
  • పలువురు మృతి చెంది ఉంటారని అనుమానం
  • సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది
  • పక్కనున్న పరిశ్రమల నుంచి ఖాళీ చేయిస్తున్న అధికారులు
సంగారెడ్డి జిల్లా బొల్లారం పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇక్కడి వింధ్యా ఆర్గానిక్స్ పరిశ్రమలో పేలుడు సంభవించడంతో మంటలు ఎగసిపడ్డాయి. అగ్నిప్రమాదం జరగడంతో కార్మికులు భయంతో చెల్లాచెదురయ్యారు. మంటలు వ్యాపించడంతో పరిశ్రమ నుంచి వెలుపలికి పరుగులు తీశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే వింధ్యా ఆర్గానిక్స్ పరిశ్రమ వద్దకు చేరుకున్నారు.

కాగా, పలువురు కార్మికులు ఈ ప్రమాదంలో చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. వారు మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. కాగా, మంటలు ఇంకా అదుపులోకి రాని నేపథ్యంలో అధికారులు సమీపంలోని పరిశ్రమలను కూడా ఖాళీ చేయిస్తున్నారు. నల్లని పొగలు సుడులు తిరుగుతూ అక్కడి వాతావరణం భీతావహంగా ఉంది.

కాగా, పరిశ్రమలోని ఓ రియాక్టర్ పేలడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు వెల్లడైంది. ఈ ఘటనలో 20 మందికి గాయాలు కాగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను బాచుపల్లి ఆసుపత్రికి తరలించారు.
Fire Accident
Vindhya Organics
Bollaram
Industrial Area
Sangareddy District

More Telugu News