‘మన సింగిల్స్ అందరికీ ఈ టైటిట్ సాంగ్ అంకితం అంటూ’ కొత్త సినిమా పాట విడుదల చేసిన సాయితేజ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘మన సింగిల్స్ అందరికీ ఈ టైటిట్ సాంగ్ అంకితం అంటూ’ కొత్త సినిమా పాట విడుదల చేసిన సాయితేజ్

sai tej releases title song
  • సాటి సోలో సోదరసోదరీమణులకు విరాట్ చెప్పేది ఏంటంటే అంటూ పోస్ట్
  • ‘సోలో బ్రతుకే సో బెటర్’ టైటిల్ సాంగ్ విడుదల
  • సుబ్బు డైరెక్షన్ లో సినిమా
సోలో బ్రతుకు సో బెటర్ అని అందరికీ చెప్పుకుంటూ తిరిగే పాత్రలో ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాలో నటిస్తోన్న యంగ్ హీరో సాయితేజ్ ఈ సినిమాలోని మరోపాటను విడుదల చేశాడు. ఈ సినిమాలో హీరో విరాట్ అనే పాత్రలోను, హీరోయిన్ అమృత అనే పాత్రలోను నటిస్తున్నారు.

‘సాటి సోలో సోదరసోదరీమణులకు విరాట్ చెప్పేది ఏంటంటే... సోలో బ్రతుకే సో బెటర్. మన సింగిల్స్ అందరికీ అంకితం’ అంటూ ఈ టైటిల్ సాంగ్‌ను ఆయన పోస్ట్ చేశాడు. ‘సోలో బోలో బ్యాచ్‌లర్.. సోలో బతుకే సో బెటర్’ అంటూ ఈ పాట ప్రారంభం అవుతుంది. ఈ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారు.

ఇప్పటికే ఈ సినిమాలోంచి కొన్ని పాటలు విడుదలై అలరిస్తోన్న విషయం తెలిసిందే. సుబ్బు డైరెక్షన్ లో 'సోలో బ్రతుకే సో బెటరు' సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఆమధ్య 'ప్రతిరోజూ పండగే'తో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సాయితేజ్ నటిస్తోన్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
sai tej
Tollywood
song
Viral Videos

More Telugu News