suicide: చెట్టుకు ఉరి వేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య

lovers commit suicide
  • సూర్యాపేట జిల్లాలోని మొద్దుల చెరువులో ఘటన 
  • పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ఆత్మహత్య
  • దర్యాప్తు చేస్తున్న పోలీసులు 
ఒకరినొకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని హాయిగా కలిసి జీవనాన్ని కొనసాగించాలనుకున్నారు. అయితే, పెద్దలు అందుకు అడ్డు చెప్పారు. దీంతో పెద్దలను ఎదిరించలేక, విడిపోయి బతకలేక తనువు చాలించారు. సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలం మొద్దుల చెరువులో ఈ ఘటన చోటు చేసుకుంది.

గ్రామ శివారులో ఓ చెట్టుకు ఆ యువతీయువకులు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రేమికుడు చివ్వెంల మండలం చందుపట్ల గ్రామానికి చెందిన ఓర్సు నవీన్‌గా పోలీసులు గుర్తించారు.  
suicide
Crime News
Suryapet District
Telangana

More Telugu News