కరోనా ఎఫెక్ట్: 24న సాయంత్రమే పోప్ ప్రాన్సిస్ ప్రార్థనలు ప్రారంభం

11-12-2020 Fri 09:31
  • సాయంత్రం ఏడున్నర గంటలకే ప్రార్థన ప్రారంభం
  • కరోనా నేపథ్యంలో నిర్ణయం
  • ఈసారి చర్చి లోపలి నుంచే దీవెనలు అందించనున్న పోప్
christmas prayers begins Evening on 24th december
క్రిస్మస్‌ను పురస్కరించుకుని ఈ నెల 24న అర్ధరాత్రి జరగాల్సిన పోప్ ఫ్రాన్సిస్ ప్రార్థనలు కరోనా నేపథ్యంలో కొన్ని గంటల ముందుగానే ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు వాటికన్ సిటీ తెలిపింది. కరోనా కారణంగా ఇటలీలో రాత్రివేళ కర్ఫ్యూ అమల్లో ఉండడమే ఇందుకు కారణం. సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో రద్దీని నియంత్రించేందుకు ఈసారి దీవెనలను కూడా చర్చి లోపలి నుంచే పోప్ ఫ్రాన్సిస్ అందిస్తారని వాటికన్ అధికారులు తెలిపారు. ఆ రోజు రాత్రి ఏడున్నర గంటలకే ప్రార్థన ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.