Paritala Sriram: ముందు నీ మీద వున్న కేసులు చూసుకో!: వైసీపీ ఎంపీ గోరంట్లపై పరిటాల శ్రీరాం ఫైర్

Paritala Sriram fires on YSRCP MP Gorantla Madhav
  • పరిటాల రవిని ఫ్యాక్షనిస్టు అన్న గోరంట్ల మాధవ్
  • చరిత్ర తెలుసుకుని మాట్లాడాలన్న శ్రీరామ్
  • నీ చరిత్ర ఏమిటో గుర్తుంచుకోవాలని మండిపాటు
హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై టీడీపీ నేత పరిటాల శ్రీరాం నిప్పులు చెరిగారు. తన తండ్రి పరిటాల రవిని ఫ్యాక్షనిస్టు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. 'నీ మీద ఉన్న రేప్, మర్డర్ కేసులు ముందు చూసుకో... ఆ తర్వాత మా గురించి మాట్లాడు' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గోరంట్ల మాధవ్ చరిత్రను తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని అన్నారు.

ఫ్యాక్షనిజం చేసి రవి రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు. అనంతపురం ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడేందుకు ఫ్యాక్షన్ జరిగిందని అన్నారు. ఎస్ఐగా ఉండి నీవు చేసింది ఏమిటని ప్రశ్నించారు. తాము గల్లీ ఫ్యాక్షన్ అయితే, నీవు ఢిల్లీలో రేపిస్ట్ అయ్యావని అన్నారు. నీ చరిత్ర ఏమిటో గుర్తుంచుకొని మాట్లాడాలని వ్యాఖ్యానించారు.

అబద్ధాలు చెప్పి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాడని శ్రీరామ్ మండిపడ్డారు. మంచి పనులు చేస్తే ప్రజలు హర్షిస్తారని చెప్పారు. ఎంపీగా ఉన్నావు, పని చేసి చూపించాలని మాధవ్ కు హితవు పలికారు. టీడీపీ హయాంలో చేసిన పనులను కొత్తగా చూపించుకుంటున్నారని... కొత్త పనులకు ఇంత వరకు టెండర్లు ఎందుకు పిలవలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. పుట్టకనుమ ప్రాజెక్టును రద్దు చేసి మూడు ప్రాజెక్టులను కడతామంటున్నారని... వాటికి టెండర్లను కూడా పిలవలేదని... పాత కాంట్రాక్టర్లే పనులు చేస్తున్నారని చెప్పారు. ఇందులో ఎవరి వాటా ఎంతో చెప్పాలని అన్నారు.
Paritala Sriram
Telugudesam
Gorantla Madhav
YSRCP
Paritala Ravi

More Telugu News