Corona Virus: ఏపీ కరోనా అప్ డేట్: 618 పాజిటివ్ కేసులు, 3 మరణాలు

corona virus spreading update in andhrapradesh
  • గడచిన 24 గంటల్లో 61,038 కరోనా పరీక్షలు
  • అత్యధికంగా కృష్ణా జిల్లాలో 121 కేసులు
  • అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 14  కేసులు 
ఏపీలో గడచిన 24 గంటల్లో 61,038 కరోనా పరీక్షలు నిర్వహించగా, 618 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 121 కేసులు రాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 14 వచ్చాయి. అదే సమయంలో 785 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో 8,73,457 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8,61,153 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 5,259 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 7,045కి చేరింది.
.
Corona Virus
Andhra Pradesh

More Telugu News