Chandrababu: ప్రత్యేక హోదాను పశువుల సంతలా కేంద్రానికి వేలంలో పెట్టారు: చంద్రబాబుపై గోరంట్ల మాధవ్ ఫైర్

ysrcp mp gorantla madhav fires on tdp chief chandrababu
  • జడ్జి పదవులకు బీసీలు పనికిరారని రాశారు
  • దొంగలా అమరావతికి పారిపోయి వచ్చారు
  • పరిటాల రవి ఎంతోమంది తలలు నరికారు
టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, పరిటాల రవిలపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ విరుచుకుపడుతూ ఆరోపణలు చేశారు. ప్రత్యేక హోదాను చంద్రబాబునాయుడు పశువుల సంతలా కేంద్రానికి వేలం పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి దొంగలా అమరావతికి పారిపోయి వచ్చారన్నారు.

జడ్జి పదవులకు బీసీలు పనికిరారని చంద్రబాబు రాశారని మాధవ్ ఆరోపించారు. నక్సలైట్లు, ఫ్యాక్షనిజం పేరుతో గతంలో పరిటాల రవి ఎంతోమంది తలలు నరికారని, ఇందుకు చంద్రబాబు సహకరించారని ఆరోపించారు. రాప్తాడు నియోజకవర్గంలో నీళ్లు లేక ఎండిపోతున్న పొలాల్లో రవి రక్తపుటేర్లు పారించారని మాధవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Chandrababu
TDP
Gorantla Madhav
YSRCP
Andhra Pradesh

More Telugu News