Sensex: దూసుకుపోయిన మార్కెట్లు.. 495 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

  • 46 వేల మార్కును దాటిన సెన్సెక్స్ 
  • 136 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 3 శాతానికి పైగా పెరిగిన ఏసియన్ పెయింట్స్
Sensex crosses 46k mark

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. సెన్సెక్స్ చరిత్రలోనే తొలిసారి 46 వేల మార్కును అధిరోహించింది. కరోనా వైరస్ వల్ల నెమ్మదించిన ఆర్థిక స్థితి వేగంగా పుంజుకుంటుందోన్న అంచనాలు ఇన్వెస్టర్ సెంటిమెంటును బలపరిచాయి.

ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 495 పాయింట్లు లాభపడి 46,104కి పెరిగింది. నిఫ్టీ 136 పాయింట్లు పుంజుకుని 13,529 వద్ద స్థిరపడింది. బేసిక్ మెటీరియల్స్, పవర్ సూచీలు మినహా మిగిలినవన్నీ లాభాల్లో ముగిశాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఏసియన్ పెయింట్స్ (3.37%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (2.67%), యాక్సిస్ బ్యాంక్ (2.19%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.15%), ఇన్ఫోసిస్ (1.85%).

టాప్ లూజర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (-1.29%), టాటా స్టీల్ (-0.79%), మారుతి సుజుకి (-0.70%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.59%), బజాజ్ ఆటో (-0.43%).

More Telugu News