నిహారిక పెళ్లి వేడుకల్లో మెగా తారల సందడి!

09-12-2020 Wed 12:16
  • రాజస్థాన్‌లో జరుగుతోన్న పెళ్లి వేడుకలు
  • రాజస్థాన్‌లో మెగా కుటుంబ సభ్యులు
  • ఈ రోజు  రాత్రి నిహారిక పెళ్లి
niharika pics go viral
మెగాబ్రదర్ నాగబాబు కూతురు నిహారిక పెళ్లి వేడుక‌లు రాజస్థాన్‌లో జరుగుతోన్న విషయం తెలిసిందే. నిహారిక పెళ్లి కోసం ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులు అంతా రాజస్థాన్ లోని ఉదయపూర్ కోటకు చేరుకున్నారు. ఈ రోజు రాత్రి నిహారిక మెడలో జొన్నలగడ్డ చైతన్య తాళి కట్టనున్నాడు.  
   
ఉద‌య్‌పూర్‌లోని ఉద‌య్ విలాస్ హోట‌ల్‌లో జరుగుతోన్న నిహారిక పెళ్లి వేడుక‌ల్లో పాల్గొన్న సెలబ్రిటీల ఫొటోలు వైరల్ అవుతున్నాయి. చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయితేజ్, లావణ్య త్రిపాఠి వంటి తారలకు సంబంధించి మరిన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. సినీ తారలు పెళ్లి వేడుకలో సందడి చేస్తూ ఉద‌య్ విలాస్ హోట‌ల్‌కు మరిన్ని మెరుపులను తీసుకొస్తున్నారు.