మహేశ్ 'సరిలేరు నీకెవ్వరు'కు మరో రికార్డు!

09-12-2020 Wed 06:20
  • సంక్రాంతి సందర్భంగా విడుదలైన చిత్రం
  • ట్రెండింగ్ లో నిలిచిన తెలుగు సినిమాల జాబితాలో తొలి స్థానం
  • దేశవ్యాప్తంగా మూడవ స్థానంలో సినిమా
Sarileru Neekevvaru New Record in Twitter

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు నటించగా, ఈ సంవత్సరం సంక్రాంతి సీజన్ లో విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' ఘన విజయాన్ని సాధించిన సంగతి విదితమే. తాజాగా ఈ సినిమా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ట్విట్టర్ లో ట్రెండింగ్ లో నిలిచిన తెలుగు సినిమాల జాబితాలో తొలి స్థానంలో నిలవడంతో పాటు అత్యధిక హ్యాష్ ట్యాగ్ లు సాధించిన చిత్రంగానూ రికార్డు కొట్టింది. ఇక దేశవ్యాప్తంగా చూస్తే, మూడవ స్థానంలో నిలిచింది. సుశాంత్ నటించిన 'దిల్ బేచారా', సూర్య హీరోగా వచ్చిన 'సూరారై పొట్రు' టాప్-2లో ఉన్నాయి.