Renigunta: రేణిగుంట పేలుడు వెనుక అసలు కారణాన్ని గుర్తించిన పోలీసులు

  • రేణిగుంట రైల్వే ట్రాక్ వద్ద భారీ పేలుడు
  • డబ్బాను కదిలించిన మహిళకు తీవ్రగాయాలు
  • విచారణ జరిపిన పోలీసులు
  • బాలాజీ వెల్డింగ్ వర్క్స్ దే బాధ్యత అని పేర్కొన్న పోలీసులు
  • నిర్లక్ష్యంగా డబ్బాను పారవేశారని వెల్లడి
Police knows what is the reason behind Renigunta railway track explosion

రేణిగుంట మండలం తారకరామనగర్ లో రైలు పట్టాల పక్కన భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఓ మహిళకు తీవ్రగాయాలయ్యాయి. పట్టాల పక్కనే ఉన్న డబ్బాను కదిలించడంతో విస్ఫోటనం జరిగింది. అయితే ఆ డబ్బా అక్కడికి ఎలా వచ్చిందన్న విషయమై పోలీసులు దర్యాప్తు జరపగా, అసలు విషయం వెల్లడైంది.

ఈ ప్రాంతంలో ఉన్న బాలాజీ వెల్డింగ్ వర్క్స్ లో హీట్ రెసిస్టింగ్ పనులు జరుగుతుండగా, ప్రమాదకర పదార్థాల అవశేషాలతో కూడిన డబ్బాను రైలు పట్టాల వద్ద పారేశారు. నిర్లక్ష్యంగా వదిలేసినందునే పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు బాలాజీ వెల్డింగ్ వర్క్స్ బాధ్యత వహించాల్సి ఉంటుందని, డబ్బాను జాగ్రత్తగా నిర్వీర్యం చేయాల్సి ఉండగా, దాన్ని అలాగే వదిలేసి వెళ్లారని పోలీసులు తెలిపారు. వెల్డింగ్ వర్క్స్ యాజమాన్యంపై కేసు నమోదు చేస్తామని చెప్పారు.

More Telugu News