Coffee Day: ఏడాది తర్వాత కాఫీ డేకు కొత్త సీఈవో.. మాళవిక హెగ్డేకు బాధ్యతలు

Coffee Days New CEO Is Wife Of Founder VG Siddhartha
  • గతేడాది ఆత్మహత్య చేసుకున్న వీజీ సిద్ధార్థ
  • మాళవికతోపాటు అదనపు డైరెక్టర్ల నియామకం
  • కాఫీడేను తిరిగి నిలబెడతానన్న మాళవిక
కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌ సీఈవో వీజీ సిద్ధార్థ మరణం తర్వాత ఏడాదికి ఆ సంస్థకు కొత్త సీఈవో వచ్చారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం.కృష్ణ కుమార్తె, కాఫీడే వ్యవస్థాపకుడు అయిన సిద్ధార్థ భార్య మాళివిక హెగ్డే నూతన సీఈవోగా నియమితులయ్యారు. సంస్థ నష్టాల్లో కూరుకుపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సిద్ధార్థ గతేడాది ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మరణానంతరం ఇండిపెండెంట్ బోర్డు సభ్యుడైన ఎస్వీ రంగనాథ్ మధ్యంతర చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.

తాజాగా, ఇప్పుడు పూర్తిస్థాయి సీఈవోగా మాళివిక నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అప్పుల్లో కూరుకుపోయిన కాఫీడేను తిరిగి నిలబెడతానని చెప్పారు. కాగా, మాళవికతోపాటు అదనపు డైరెక్టర్లుగా సీహెచ్ వసుంధరా దేవి, గిరి దేవనూర్, మోహన్ రాఘవేంద్ర నియమితులయ్యారు.  2025 వరకు వీరు పదవుల్లో కొనసాగనున్నారు.
Coffee Day
CEO
VG Siddhartha
malvika Hegde

More Telugu News