నేడు భారత్ బంద్.. మద్దతిస్తున్న 24 పార్టీలు
- వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన
- నేటి ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు బంద్
- చర్చల్లో కొనసాగుతున్న ప్రతిష్ఠంభన
ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేటి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బంద్ నిర్వహించనున్నారు. కాగా, రైతు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం జరుపుతున్న చర్చలు కొలిక్కి రావడం లేదు. ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకపోవడంతో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. రైతు సంఘాలతో ప్రభుత్వం రేపు మరోమారు చర్చలు జరపనుంది.