యావత్ దేశం ఇప్పుడు తిరుపతి వైపు చూస్తోంది: సునీల్ దేవధర్

07-12-2020 Mon 15:47
  • త్వరలో తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక
  • తిరుపతి బీజేపీ నేతలతో సునీల్ దేవధర్ సమావేశం
  • ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
  • దుబ్బాక, జీహెచ్ఎంసీ తర్వాత తిరుపతిలోనూ గెలుస్తామని ధీమా
Sunil Deodhar says whole india looking towards Tirupati by polls

దుబ్బాక అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల్లో విజయం సాధించడం, జీహెచ్ఎంసీలో గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో డివిజన్లు గెలుచుకోవడం బీజేపీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేసింది.  ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దేవధర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయప్రస్థానం తర్వాత ఇప్పుడు యావత్ దేశం దృష్టి తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలపై పడిందని తెలిపారు.

తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సునీల్  దేవధర్ ఇవాళ తిరుపతి నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఉప ఎన్నికల్లో బీజేపీ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహంపై వారితో చర్చించారు. తిరుపతిలోనూ విజయం తమదేనంటూ ధీమా వ్యక్తం చేశారు. గెలుపు ప్రస్థానాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో వెల్లడించారు.