Thamanna: వెబ్ సీరీస్ షూటింగ్ పూర్తిచేసిన తమన్నా

Thamanna completes her part of shoot for web series
  • 'ఎలెవెంత్ అవర్' వెబ్ సీరీస్ లో తమన్నా
  • ఒక రాత్రి పూట జరిగే సంఘటనగా కథ
  • బోల్డ్ సీన్స్ కూడా చేసిన తమన్నా 
  • 'ఆహా' ఓటీటీ సంస్థ కోసం నిర్మాణం 
ఒకప్పుడు అగ్రతారగా రాణించిన కథానాయిక తమన్నా హవా ఇటీవల కాస్త తగ్గిందనే చెప్పాలి. కొత్త కథానాయికల రాకతో ఆమె కాస్త వెనక్కు జరగాల్సి వచ్చింది. అయినప్పటికీ, ఆమెకు కొన్ని సినిమాలు వస్తూనే వున్నాయి. ఇదే సమయంలో ఓపక్క సినిమాలు చేస్తూనే ఈ ముద్దుగుమ్మ తాజాగా వెబ్ సీరీస్ వైపు కూడా మళ్లింది. 'ఆహా' ఓటీటీ కోసం 'ఎలెవెంత్ అవర్' (11th Hour) పేరిట రూపొందుతున్న వెబ్ సీరిస్ లో తను ప్రధాన పాత్ర పోషిస్తోంది.

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సీరీస్ లో షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఆమధ్య తమన్నా కొవిడ్ బారిన పడింది. ఇక తాజాగా ఈ చిన్నది ఈ సీరీస్ కి సంబంధించి తన పార్ట్ ను పూర్తిచేసినట్టు తెలుస్తోంది. అమెరికన్ వెబ్ సీరీస్ '24' ఆధారంగా ఇది రూపొందుతోంది. ఒక రాత్రి పూట జరిగే సంఘటనగా ఈ సీరీస్ కథ కొనసాగుతుంది. ఇక ఇందులో తమన్నా కొన్ని బోల్డ్ సీన్స్ కూడా చేసినట్టు సమాచారం.
Thamanna
Web Series
OTT
Aha

More Telugu News